•  

పడక గదిలో సుఖాన్ని ఇస్తావా? యువ నటికి ధనుష్ మేనేజర్ లైంగిక వేధింపులు

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు, మహిళా యాక్టర్లకు వేధింపుల వార్తల అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. మీటూ ఉద్యమం సమయంలోను దేశవ్యాప్తంగా, అలాగే ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీని ఇలాంటి వార్తలు కుదిపేసాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు తగ్గాయనే అనుకొంటుండగానే.. బాలీవుడ్‌లో స్టార్ హీరో మేనేజర్‌పై ఓ నటి సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా సదరు హీరో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఆ హీరో ఎవరు? ఆ హీరో మేనేజర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి ఎవరు అనే విషయానికి వస్తే..

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు శ్రేయాస్ అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఉందనే విషయం వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు స్పష్టం చేశాయి. కేవలం మేనేజర్ హోదాలోనే కాకుండా ఫ్రెండ్ కంటే ఎక్కువగా ధనుష్తో శ్రేయాస్‌కు చనువు ఉందనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటాయి. అలాంటి వ్యక్తిపై టీవీ యాక్టర్ మాన్య ఆనంద్ తీవ్రమైన ఆరోపణలు చేయడం జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.


TV actor Manya Anand made commitment allegations on Dhanush s Manager
 

ధనుష్ మేనేజర్ తనతో ఓ సందర్భంలో ఓ సినిమా ఆఫర్ గురించి చర్చలు జరిపారు. ఆయితే ధనుష్ నటించే సినిమాలోని పాత్ర కోసం తనను కొన్ని విషయాల్లో రాజీ పడాలని సూచించాడు. అయితే తాను ఎలాంటి విషయాల్లో అడ్జస్ట్ కావాలో వివరంగా చెప్పమని అడిగితే డొంక తిరుగుడు మాటలు మాట్లాడాడు. అయితే తనతో మాట్లాడిన తీరు, ఆ మాటల్లో అర్ధాలు మరోలా ఉండటంతో నాకు పరిస్థితి అర్ధమైంది. దాంతో నేను అతడికి గట్టిగా మందలించే ప్రయత్నం చేశాను అని ఆమె తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

మహేష్ బాబు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. కారుకు చలానా..తట్టుకోలేక అభిమాని జరిమానా చెల్లింపు1

సినిమాలో వేషం ఇస్తాను. కానీ కమిట్‌మెంట్ ఇవ్వాలి. అడ్జస్ట్ చేసుకోవాలి అని అన్నాడు. దేనికి కమిట్‌మెంట్? కమిట్‌మెంట్ అంటే ఏమిటి? నేను ఎందుకు కమిట్మెంట్ ఇవ్వాలి? ధనుష్ సార్ కోసం ఆ త్యాగం, ఆ నిర్ణయం తీసుకోలేవా? అనే విధంగా మాట్లాడాడు. దాంతో నేను గట్టిగా అరిచాను. అయితే నన్ను సముదాయిస్తూ.. ధనుష్ ఆఫీస్ లొకేషన్‌ను నాకు షేర్ చేసి.. ఆయనను కలుసుకోమన్నాడు. ఆ తర్వాత నాకు కొన్ని స్క్రిప్టులు పంపించాడు. అయితే వాటిని నేను చదవనూ లేదు. ఆయన ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరించలేదు. ఆ సినిమాను చేయడానికి ఇష్టపడలేదు అని ఆమె చెప్పింది.

Globe Trotter: వారణాసి ఈవెంట్ కోసం ఖర్చు ఎన్ని కోట్లంటే? ఆ విషయంలో రాజీ పడని రాజమౌళి!

పడక గదిలోకి వెళ్లడానికి, శారీరక సుఖాలన అందించడం, ఇతర పనులు చేయలేం. ఎందుకంటే మేము ఆర్టిస్టులం. మాకు నటించడం మాత్రమే తెలుసు. ఆఫర్ ఇస్తే నటిస్తాం. కానీ అందుకు ప్రతిఫలంగా తిరిగి వేరే ఇవ్వలేం అని మాన్య ఆనంద్ ఘాటుగా స్పందించింది. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై ధనుష్ గానీ, ఆయన మేనేజర్ గానీ ఇంకా స్పందించలేదు.

Kodama Simham Re Release Review: కొదమ సింహం రీ రిలీజ్ రివ్యూ

ధనుష్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం తేరే ఇష్క్ మే అనే హిందీ సినిమాలో నటించాడు. ఆయన సరసన కీర్తి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 28వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నది.

Credit: Filmibeat

Get Notifications from Indiansutras